నిజామాబాద్ జిల్లాలో డ్రగ్స్​ నియంత్రణకు చర్యలు : అదనపు కలెక్టర్ కిరణ్​కుమార్​

నిజామాబాద్ జిల్లాలో డ్రగ్స్​ నియంత్రణకు చర్యలు : అదనపు కలెక్టర్ కిరణ్​కుమార్​

నిజామాబాద్, వెలుగు : సమాజానికి పెనుసవాల్​గా మారిన మత్తు, మాదకద్రవ్యాల నిరోధానికి అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్​ (రెవెన్యూ) కిరణ్​కుమార్​ కోరారు. బుధవారం ఆయన తన ఛాంబర్​లో ఏర్పాటు చేసిన మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో మాట్లాడారు. రోడ్​, రైలు మార్గాల్లో నిరంతర నిఘా పెట్టి డ్రగ్స్​ రవాణాను గుర్తించాలని, లోకల్​గా గంజాయి సాగు మూలాలను తెలుసుకోవాలన్నారు. కల్తీ కల్లులో కలుపడానికి ఉపయోగించే అల్ఫాజోలం నిల్వలు పసిగట్టాలన్నారు.  

అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఎక్సైజ్​ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఎంహెచ్​వో డాక్టర్​ రాజశ్రీ, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ వాజీద్​ హుస్సేన్​, ట్రాన్స్​పోర్టు ఆఫీసర్ ఉమామహేశ్వర్​రావు, ఫారెస్ట్​, కమర్షియల్ ట్యాక్స్, డ్రగ్ కంట్రోలింగ్ అధికారులు హాజరయ్యారు. ఎండాకాలంలో ప్రజలకు అందించాల్సిన సేవలపై ఏర్పాటు చేసిన టాస్క్​ఫోర్స్​ కమిటీ మీటింగ్​లో అదనపు కలెక్టర్ కిరణ్​కుమార్​ మాట్లాడారు. బస్తీ దవాఖానాలు, పీహెచ్​సీలు, హెల్త్​ సెంటర్లు, అంగన్​వాడీ సెంటర్లకు రెట్టింపు స్థాయిలో ఓఆర్​ఎస్​ ప్యాకెట్లు సరఫరా చేయాలని, ఉపాధి కూలీలు వడదెబ్బబారిన పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.