![జోగులాంబలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి : అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ](https://static.v6velugu.com/uploads/2025/02/additional-collector-lakshminarayana-has-ordered-proper-arrangements-for-jogulamba-mahashivratri-celebrations_5DHtJqoFkp.jpg)
గద్వాల, వెలుగు: జోగులాంబలో అమ్మవారి సన్నిధిలో మహాశివరాత్రి మహోత్సవాలకు పక్కాగా ఏర్పాటు చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో సంబంధిత ఆఫీసర్లతో మహాశివరాత్రి ఉత్సవాలపై మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్, ఆలయ ఈవో ఇద్దరు సంబంధిత ఆఫీసర్లతో కోఆర్డినేషన్ చేసుకొని బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈనెల 25 నుంచి మార్చి 1 వరకు ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పరిసరాలను క్లీన్ అండ్ గ్రీన్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావు, ఈవో పురేందర్, కమిషనర్ చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు.