గద్వాల టౌన్, వెలుగు: డ్రగ్స్ నిర్మూలన కోసం అన్ని శాఖల ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని జోగులాంబ గద్వాల అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నష్ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు, నియంత్రణపై మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులపై తల్లిదండ్రులు, టీచర్లు నిఘా పెట్టాలన్నారు.
స్టూడెంట్లకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించాలన్నారు. గంజాయి సాగు, రవాణా నియంత్రణకు ఎక్సైజ్, అగ్రికల్చర్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు. చెక్ పోస్టుల వద్ద పకడ్బందీ తనిఖీలు చేపట్టాలన్నారు.