
కూసుమంచి, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లలోని స్టూడెంట్స్ కు మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులకు సూచించారు. బుధవారం కూసుమంచి ఉన్నత పాఠశాలను అడిషనల్ కలెక్టర్ తోపాటు, డీఈవో సోమశేఖర శర్మ, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య వేర్వేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు.
పాఠ్యాంశాలు అర్థం కాకపోతే తిరిగి అడగాలని సూచించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. డీఈవో మాట్లాడుతూ స్కూల్‌కు టీచర్స్‌ను రెండు రోజుల్లో డిప్యూటేషన్ పై పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఎం శ్రీనివాస్, స్కూల్ఇన్ చార్జి హెడ్మాస్టర్ రేల విక్రమ్ రెడ్డి, ఎంపీఎం సత్యవర్ధన్ రాజు, సీసీలు నవీన్ బాబు, కృష్ణయ్య , శ్రీను, రాంబయమ్మ, వీవో అధ్యక్షురాలు సీత, భారతమ్మ , గ్రామదీపికలు రమాదేవి, రమణ, శిరీష, మల్లిక తదితరులు పాల్గొన్నారు.