తహసీల్దార్ ఆఫీస్ తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం తహసీల్దార్ ఆఫీస్ ను బుధవారం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ తనిఖీ చేశారు. రికార్డ్ రూమ్, స్టాఫ్ అటెండెన్స్, దస్త్రాలను పరిశీలించారు.

ఈసందర్భంగా ఆఫీస్ స్టాఫ్ తో కలిసి సమావేశం నిర్వహించారు. పెండింగ్ ఫైల్స్ ను క్లియర్ చేసేందుకు రోజువారీ ప్రణాళికను సూచించారు. పబ్లిక్ కు ఇబ్బంది లేకుండా మీసేవ సర్టిఫికెట్లను త్వరగా కంప్లీట్ చేయాలని తహసీల్దార్ లూథర్ విల్సన్ కు సూచించారు. సమావేశంలో డీటీ, ఆర్ఐ, సర్వేయర్​ సిబ్బంది పాల్గొన్నారు.