ములుగు, వెలుగు: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలకు లోబడి ఏప్రిల్ 1లోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ములుగు అడిషనల్కలెక్టర్ మహేందర్‌జీ సూచించారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో యాసంగి ధాన్యం కొనుగోలుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు.
రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి, ఏ రకం ధాన్యానికి రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183ను మద్దతు ధర పొందాలని సూచించారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామని పొరుగు రాష్ర్టం నుంచి ఇక్కడికి ధాన్యం రాకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. సివిల్సప్లై అధికారి రాంపతి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ కాంటాలు మాత్రమే వాడాలని సూచించారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, డీసీవో సర్దార్ సింగ్, గిరిజన సహకార సంస్థ జిల్లా మేనేజర్ ప్రతాపరెడ్డి, మార్కెటింగ్ ఆఫీసర్ సుచరిత, అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు తదితరులు
పాల్గొన్నారు.