
మెదక్, వెలుగు: మే 4న జరిగే -నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో రెవెన్యూ, పోస్టల్, ఎలక్ట్రిసిటీ, పోలీస్, విద్యా, వైద్య శాఖ అధికారులు, పలువురు ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగేశ్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో నీట్ పరీక్ష సెంటర్ కేటాయించామని, 487 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు.
మే 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. స్టూడెంట్స్కు పరీక్ష కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో రమాదేవి, యూజీసీ- నీట్ సిటీ కోఆర్డినేటర్, నోడల్ ఆఫీసర్ హుస్సేన్, డీఈవో రాధాకిషన్ , డీఎస్పీ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
'ఉల్లాస్' తో వయోజన విద్యకు ఊతం
'ఉల్లాస్' కార్యక్రమంతో వయోజన విద్యకు ఊతం లభిస్తుందని అడిషనల్ కలెక్టర్నగేశ్అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉల్లాస్' ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా, మండల స్థాయి మహిళ స్వయం సహాయక సంఘాల నిరక్షరాస్యుల వివరాలను ఉల్లాస్ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయించాలన్నారు. ఉల్లాస్ పథకంపై ప్రచారం ద్వారా అవగాహన కల్పించాలని, జిల్లాకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేయాలని తెలిపారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలలో 18 నుంచి 45 సంవత్సరాల లోపు వారే ఎక్కువగా చనిపోతున్నారన్నారు. వీటిని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.