![ఎమ్మెల్సీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి : అడిషనల్ కలెక్టర్ నగేశ్](https://static.v6velugu.com/uploads/2025/02/additional-collector-nagesh-has-ordered-the-officials-to-make-proper-arrangements-for-the-mlc-elections-to-be-held-on-february-27_6PUXQwe9hI.jpg)
మెదక్టౌన్, వెలుగు : ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అడిషనల్కలెక్టర్నగేశ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మెదక్ కలెక్టరేట్లో పీవోలు, ఏపీవోలు, సెక్టార్, నోడల్ అధికారులకు పవర్ పాయింట్ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్కలెక్టర్ మాట్లాడుతూ..పోలింగ్సిబ్బంది ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు-22, టీచర్ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు-21 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
43 మంది పీవోలు, 43 ఏపీవోలు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల13వరకు కలెక్టర్ ఆఫీసులో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీవోలు రమాదేవి, జయచంద్రారెడ్డి, మహిపాల్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి, రాజిరెడ్డి, పీవోలు, ఏపీవోలు, నోడల్అధికారులు పాల్గొన్నారు.