
మెదక్‌టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులపై దృష్టిపెట్టాలని అడిషనల్ కలెక్టర్నగేశ్అన్నారు. సోమవారం మెదక్ కలెక్టరేట్‌లో జడ్పీ సీఈవో ఎల్లయ్యతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా నగేశ్మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 24 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వాటిని సంబంధిత అధికారులు పరిష్కరించాల్సిందిగా సూచించారు.
ఎల్ఆర్ఎస్లు పరిష్కరించాలి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేని ఎల్ఆర్ఎస్దరఖాస్తులను పరిష్కరించాలని అడిషనల్కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో మెదక్కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఎఫ్టీఎల్, చెరువు శిఖం, ఆలయ భూములు, నాల మొదలైన వాటిని తనిఖీ చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో భుజంగరావు, ఆర్డీవో రమాదేవి, డీపీవో యాదయ్య, జడ్పీ సీఈవో ఎల్లయ్య, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీవోలు, ఇరిగేషన్ అధికారులుపాల్గొన్నారు.
సంగారెడ్డి టౌన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జడ్పీ సీఈవో జానకిరాం రెడ్డి అధికారులకు సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 37 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జడ్పీసీఈవోతో పాటు సివిల్ సప్లై డీఎం రాజేశ్వర్, డీపీవో సాయిబాబా, కలెక్టరేట్ ఏవో పరమేశ్‌కు విన్నవించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని జడ్పీ సీఈవో అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.