
మెదక్టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తుల పట్ల అధికారులు దృష్టిపెట్టాలని అడిషనల్కలెక్టర్నగేశ్ సూచించారు. సోమవారం మెదక్కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన వినతులను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. మొత్తం 58 దరఖాస్తులు రాగా వాటిలో భూభారతి-14, ఎంప్లాయిమెంట్- 4, ఇందిరమ్మ ఇండ్లు 6, పెన్షన్ 1, ఇతర సమస్యలు-33 ఉన్నట్లు తెలిపారు. డీఈవో రాధాకిషన్, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజావాణికి 43 ఫిర్యాదులు
సంగారెడ్డి టౌన్: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 43 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిషారం చూపే దిశగా పనిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో పద్మజారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేట టౌన్: సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. భూసంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్లు, ఇతర అర్జీలు కలిసి మొత్తం 59 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ వో నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.