- స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీజ
ఖమ్మం, వెలుగు : జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అడిషనల్కలెక్టర్ శ్రీజ అధికారులకు సూచించారు. గురువారం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్ లో అధికారులతో ఆమె సమీక్షించారు.
అక్టోబర్ 3 నుంచి 9 వరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహిస్తున్న ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు జిల్లా నుంచి 340 మంది టెన్త్ అభ్యర్థులు, 373 మంది ఇంటర్ అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రం పరిసరాలలో 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కే.రవిబాబు, డిప్యూటీ డీఎంహెచ్వో బి.సైదులు పాల్గొన్నారు.