నిషేధిత పటాకులు అమ్మితే చర్యలు : కలెక్టర్ పి. శ్రీజ

నిషేధిత పటాకులు అమ్మితే చర్యలు :  కలెక్టర్ పి. శ్రీజ
  • ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీజ

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లా ప్రజలు సురక్షితంగా దీపావళి పండుగ జరుపుకొనేలా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సూచించారు. నిషేధిత పటాకులు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో  అధికారులతో కలిసి ఆమె దీపావళి పటాకుల షాపుల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. 

ఈనెల 31న దీపావళి పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ తదితర శాఖలన్ని సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో పటాకుల షాపుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. అగ్నిమాపక శాఖ ఎన్ వోసీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ అనుమతులు ఉండాలని చెప్పారు. షాపుల మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూడాలన్నారు. 

ఒక క్లస్టర్ లో 50 షాపులకు మించి ఉండొద్దని చూసించారు. విద్యుత్ పనుల్లో లూజ్ వైర్లు, అతుకుల వైర్లు లేకుండా చూడాలన్నారు. హెల్త్ సూపర్​వైజర్, ఏఎన్ఎంలతో వైద్య శిబిరం ఏర్పాటుచేసి, డ్రెస్సింగ్ కిట్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు.  పండుగ రోజు స్పెషలిస్ట్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. 

ప్రమాదాలు, ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్​ 1077 కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, ఎస్బీ ఏసీపీ సాంబరాజు, జిల్లా అగ్నిమాపక అధికారి బి. అజయ్ కుమార్, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్​ జకీరుల్లా, డీఎంహెచ్​వో వి. సుబ్బారావు, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్, కేఎంసీ సహాయ కమిషనర్ షఫీఉల్లా, మధిర, వైరా మున్సిపల్ కమిషనర్లు సంపత్ కుమార్, వేణు పాల్గొన్నారు.