సీఎం కప్​ పోటీలకు ఏర్పాట్లు చేయాలి : అడిషనల్ ​కలెక్టర్ ​పింకేశ్​ కుమార్

సీఎం కప్​ పోటీలకు ఏర్పాట్లు చేయాలి : అడిషనల్ ​కలెక్టర్ ​పింకేశ్​ కుమార్

జనగామ అర్బన్, వెలుగు : ఈ నెల 16 నుంచి 21 వరకు జిల్లా స్థాయి సీఎం కప్​క్రీడాపోటీలు జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జనగామ అడిషనల్ ​కలెక్టర్ ​పింకేశ్​ కుమార్​ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో పోటీల నిర్వహణకు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

 అంతకుముందు ఆయన పెంబర్తి గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో సీఈవో సరిత, డీవైఎస్​వో వెంకట్​ రెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.