హుజూర్ నగర్, వెలుగు : మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తి, ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్సుల బకాయిల వసూళ్లపై మున్సిపల్ ఉద్యోగులు దృష్టి పెట్టాలని అడిషనల్ కలెక్టర్, మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ రాంబాబు సూచించారు. శుక్రవారం హుజూర్ నగర్ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా అడిషనల్ కలెక్టర్ రాంబాబు బాధ్యతలు స్వీకరించారు. 100 శాతం పన్ను వసూలు సాధించాలని, ఎల్ఆర్ఎస్ స్కీమ్‌కు సంబంధించి మొత్తం దరఖాస్తులను ఆన్ లైన్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, అధికారులు వినోద్ కుమార్, రంగారావు, శ్రీధర్ రెడ్డి, అశోక్, ఉద్యోగులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పించాలి..
నేరేడుచర్ల, వెలుగు : మున్సిపాలిటీలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. శనివారం నేరేడుచర్ల మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.