
మెదక్ టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని అడిషనల్ కలెక్టర్ రమేశ్అన్నారు. గురువారం కొల్చారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పరీక్ష కేందంలో కల్పించిన వసతులను గమనించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్గఫార్, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్స్ ఉన్నారు.