
మెదక్టౌన్, వెలుగు: జీవ వైవిధ్యం భవిష్యత్తరాలకు విలువైన ఆస్తి అని అడిషనల్కలెక్టర్రమేశ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ఆఫీసులో ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఈవో రాధాకృష్ణ, కో-ఆర్డినేటర్స్ సుదర్శన్, మూర్తి, స్టూడెంట్స్తో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. మానవ మనుగడ జీవ వైవిద్యం మీద ఆధారపడి ఉందని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అడవుల నరికివేత వల్ల సకాలంలో వర్షాలు పడడం లేదన్నారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని తెలిపారు.