మూడు నెలల యాక్షన్ ప్లాన్​ సిద్ధం చేయాలి : అడిషనల్​ కలెక్టర్ శ్రీజ

ఏటూరునాగారం, వెలుగు: కన్నాయిగూడెం మండలాల్లో మూడు నెలల అస్పిరేషనల్ బ్లాక్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ములుగు అడిషనల్​ కలెక్టర్ శ్రీజ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో అస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంపై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్​మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతీ వారం రివ్యూ మీటింగ్​పెట్టాలని, ఎల్ఎంపీ రిజిస్టర్ తనిఖీ చేయాలని ఆదేశించారు.

గ్రామాల్లో మిషన్ భగీరథ సర్వే రేపటి వరకు పూర్తిచేయాలని, అంగన్వాడీ సూపర్ సూపర్​వైజర్లు, సీడీపీవోల ఆధ్వర్యంలో గ్రామాల్లో పోషకాహారం, మాత శిశు సంరక్షణపై అవగాహన కల్పిస్తూ వారికి పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం అదే మండలంలోని గంగుగూడెం, గుట్టల గంగారం గ్రామాల్లో గిరిజన సంక్షేమశాఖ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించి, వేగంగా పూర్తి చేయాలన్నారు.

వర్షాకాలం నేపథ్యంలో తుపాకులగూడెం బ్యారేజ్ వద్ద జరుగుతున్న సాండ్ బ్యాగ్స్ ఫిల్లింగ్ పనులకు సంబంధించి అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ ప్రోగ్రాం ఆఫీసర్, పీహెచ్​సీ వైద్యాధికారి అభినవ్ తదితరులు పాల్గొన్నారు.