సర్కారు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి

ములుగు, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వందశాతం ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని అడిషనల్​కలెక్టర్ శ్రీజ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో డీఎంహెచ్ వో అల్లెం అప్పయ్య అధ్యక్షతన పీహెచ్ సీ వైద్యాధికారులు, జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వైద్యాధికారులకు రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని గిరిజనులకు ఉత్తమ సేవలు అందించాలన్నారు.

రవాణా సౌకర్యాలు ముందస్తుగా ఏర్పాటు చేసుకునేవిధంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలను సమన్వయంతో ప్రణాళికలు వేసుకోవాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్​వో జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని, మాతా శిశు సంరక్షణ సేవలపై పర్యవేక్షించాలన్నారు.

ఏటూరునాగారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ప్రత్యేక వైద్యం నిపుణుల సేవలు ప్రజలకు అందేవిధంగా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ జగదీశ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూరింటెండెంట్​సురేశ్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.