నల్గొండ అర్బన్, వెలుగు : వాన కాలం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు.బుధవారం అయన తన చాంబర్లో రైస్ మిల్లర్లతో వానాకాలం ధాన్యం కొనుగోలు, కష్టం మిల్లింగ్ రైస్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కష్టం మిల్లింగ్ రైస్ ఇప్పటి వరకు 90 శాతం పూర్తయిందని, తక్కిన 10 శాతాన్ని వారం రోజులలో పూర్తి చేయాలని, లేనట్లయితే పూర్తి చేయని వారిని డిఫాల్టర్లు గా గుర్తించి వచ్చే సీజన్లో దాన్యం కేటాయింపు చేయడం జరగదని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా సీఎంఆర్ 70 శాతం ఉండగా,నల్గొండ జిల్లాలో 90 శాతం సీఎంఆర్ ను పూర్తి చేసినట్టు తెలిపారు.రానున్న సీజన్లో సన్నధాన్యం సైతం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు సిద్ధం కావాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీశ్ ,నల్గొండ రైస్ మిల్లర్ల జిల్లా సంఘం అధ్యక్షులు నారాయణ, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, తదితరులు హాజరయ్యారు.