
ఖమ్మం, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజావాణి (గ్రీవెన్స్) లో జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ, డీఈఆర్డీవో సన్యాసయ్య తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టరేట్ లో కార్యాలయాలు ఏర్పాటు చేసిన వివిధ శాఖలు వారి పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాల వివరాల నివేదికను మంగళవారం సాయంత్రంలోగా అందజేయాలని సూచించారు.