దేవరకొండ(చింతపల్లి).వెలుగు: డిండి ఎత్తిపోతల పథకంలో భూముల కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నల్గొండ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం చింతపల్లి మండల కేంద్రంలోని సాయి సుమంగళి గార్డెన్స్ లో డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న మర్రిగూడ మండలం నర్సిరెడ్డి గూడెంగ్రామ 289 మంది భూ నిర్వాసితులకు చింతపల్లి మండల కేంద్రంలోని 154 సర్వే నెంబర్లో పునరావాసం కింద ఇండ్ల స్థలాలు డ్రా పద్ధతిలో కేటాయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటాయించిన స్థలాల్లో మౌలిక వసతులైన రోడ్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, విద్యుత్ అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఈఈ రాములు, డీఈ కాసీం, ఏఈ రఘు, మర్రిగూడ, చింతపల్లి తహసీల్దార్ శ్రీనివాస్, రమాకాంత్ శర్మ, ఆర్ఐలు సునీత,రామారావు, సర్వేయర్ రతన్లాల్, రెవిన్యూ,ఇరిగేషన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.