వనమహోత్సవం టార్గెట్ 40.48 లక్షల మొక్కలు : కలెక్టర్ సుధీర్ కుమార్

వనమహోత్సవం టార్గెట్ 40.48 లక్షల మొక్కలు : కలెక్టర్ సుధీర్ కుమార్

వికారాబాద్, వెలుగు: జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో అటవీ సంపదను కాపాడుకోవాలని జిల్లా ఇన్ చార్జి అడిషనల్​కలెక్టర్ సుధీర్ కుమార్ సూచించారు. గురువారం  వివిధ అంశాలపై ఎంపీడీవోలు , తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్సు లో నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది వనమహోత్సవం కింద 40. 48 లక్షల నాటడమే లక్ష్యమని అన్నారు. అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నట్లు తెలిస్తే  వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ఎఫ్ఆర్వోలు తమ పరిధిలో అటవీ భూముల సరిహద్దులను  ఏర్పాటు చేయాలని, పరిరక్షణలో సమన్వయంతో పని చేయాలని తెలిపారు.  జిల్లా అటవీ శాఖాధికారి జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ, అటవీ సంపదను కాపాడేందుకు పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారామందించాలని కోరారు.  పీపీటీ ద్వారా అటవీశాఖ చేసే పనులపై వివరించారు. ఈ సమావేశంలో  అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, డీఆర్డీఏ శ్రీనివాస్, డీపీఓ జయసుధ పాల్గొన్నారు.