వీపనగండ్ల.వెలుగు: వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ తిరుపతిరావు శనివారం వీపనగండ్ల తహసీల్దార్ ఆఫీస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇబ్బందికరంగా ఉన్న తహసీల్దార్ ఆఫీస్ ను మరో భవనం లోకి మార్చేందుకు ప్రభుత్వ భవనాలను పరిశీలించారు.
బీసీ బాలుర వసతి గృహం, బీసీ పాఠశాల, మండల పరిషత్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తో పాటు ప్రైవేట్ బిల్డింగును పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య, కాంగ్రెస్ నాయకులు లోడుగు రాజు, చిన్న రాంబాబు తదితరులు ఉన్నారు.