- అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి
యాదగిరిగుట్ట, వెలుగు : స్టూడెంట్లకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని(కేజీబీవీ) శుక్రవారం సందర్శించారు. కిచెన్, స్టోర్ రూమ్‌ను పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఫుడ్ ప్రిపరేషన్‌లో అన్ని జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.
అనంతరం బొమ్మలరామారం మండలం హనుమాపురంలో ఉపాధి హామీ కింద జరుగుతున్న చెరువు పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వంద రోజులు పనిదినాలు కంప్లీట్ చేసుకున్న ఇద్దరు కూలీలను ఆయన సన్మానించారు. ఆయన వెంట డీఈవో నారాయణరెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి ఆఫీసర్ నాగిరెడ్డి, ఉపాధి హామీ ఆఫీసర్లు తదితరులు ఉన్నారు.