లైబ్రరీల్లో పోటీ పరీక్షల బుక్స్​ ఉంచాలె : వీరారెడ్డి

యాదాద్రి, వెలుగు: గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమయ్యే బుక్స్​ అందుబాటులో ఉంచాలని అడిషనల్​ కలెక్టర్​వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌లో గ్రంథాలయాల పనితీరుపై రివ్యూ నిర్వహించారు.  ఈ సందర్భంగా మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి గ్రంథాలయాలకు రావాల్సిన బకాయిల గురించి అధికారులు ప్రస్తావించారు.  సెస్​ రాకపోవడంతో ఆర్థిక భారం పడుతోందని వివరించారు.

అనంతరం అడిషనల్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ...  సెస్ బకాయిలు వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. లైబ్రరీల్లో అన్ని వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం సుధీర్, డీఈవో కే నారాయణరెడ్డి, డీపీవో సునంద, డీపీఆర్​వో పీ వెంకటేశ్వరరావు, మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు.