ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మార్కెట్‌యార్డులో మంగళవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్కలెక్టర్వెంకట్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు.
కార్యక్రమంలో డీఆర్డీవో నాగపద్మజ, డీఎస్వో ఉమారాణి, తహసీల్దార్ జగత్ సింగ్, ఏవో రాజ్ కుమార్, ఏపీఎం రవీందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి
తదితరులున్నారు.