భద్రాద్రికొత్తగూడెం. వెలుగు : గ్రీవెన్స్‌లో వచ్చిన ప్రతి దరఖాస్తులను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల వద్ద నుంచి దరఖాస్తులను తీసుకున్నారు.
ప్రజావాణిలో ఎక్కువగా డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు, పించన్లు, రేషన్‌కార్డులు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి.