భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రూప్3 ఎగ్జామ్స్‌కు ఏర్పాట్లు పక్కాగా చేయాలని అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో పలు శాఖల ఆఫీసర్లతో బుధవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఈ నెల 17,18 తేదీల్లో గ్రూప్ 3 ఎగ్జామ్స్ జరుగనున్నాయని తెలిపారు.
జిల్లాలో 39 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 13,478 మంది ఎగ్జామ్‌కు అటెండ్ కానున్నారన్నారు. 39 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 39 చీఫ్ సూపరింటెండెంట్లు, 12 మంది ఫ్లయింగ్ స్క్వాడ్, రూట్ ఆఫీసర్లు 12 మందితో పాటు 40 అబ్జర్వర్లు ఎగ్జామ్స్‌ను పర్యవేక్షిస్తారని చెప్పారు. ఎగ్జామ్స్ సెంటర్స్ ఉన్న కాలేజీ, స్కూళ్లకు ప్రహరీ లేకపోతే అదనపు పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేయాలన్నారు.
ఖమ్మంలో..
ఖమ్మం టౌన్ : ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జరిగే గ్రూప్–3 పరీక్షల కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ ఎస్ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 87 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సెంటర్లకు 500 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.