భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రీవెన్స్లో వచ్చే దరఖాస్తుల పరిష్కారంపై ఆఫీసర్లు దృష్టి పెట్టాలని అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పులిపాటి ప్రసాద్ పారామెడికల్ కాలేజీలో కనీస సౌకర్యాలు, ల్యాబ్లు లేవంటూ పలువురు స్టూడెంట్స్ ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
క్లాసెస్ కూడా సక్రమంగా నడవడం లేదని కంప్లైంట్ ఇచ్చారు. రామాంజనేయ కాలనీలోని ఖాళీ ప్లాట్లు పిచ్చి చెట్ల పొదలతో అడివిని తలపిస్తున్నాయని, దీంతో కాలనీ వాసులు ఇబ్బంది పడ్తున్నామంటూ ఫిర్యాదు చేశారు. టేకులపల్లి మండలంలోని బద్దుతండా, కుంటల్ల గ్రామపంచాయతీలకు కలిపి ఒకటే రేషన్ షాప్ ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుందని ఆ ప్రాంత వాసులు కంప్లైంట్ ఇచ్చారు. ఈ ప్రోగ్రాంలో పలు శాఖల జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఖమ్మం టౌన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లు డాక్టర్. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అర్జీలు స్వీకరించారు. మొత్తం 35 వినతులు వచ్చాయని అధికారులు తెలిపారు. అనంతరం తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సందర్భంగా అదనపు కలెక్టర్లు ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, డీఆర్వో ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ పరిపాలన అధికారి అరుణ, తదితరులు తెలిపారు.