- భద్రాద్రికొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డ్రగ్స్, గంజాయితో జరిగే నష్టాలను స్టూడెంట్స్‌కు, యూత్ కు అవగాహన కల్పించాలని భద్రాద్రికొత్తగూడెం అడిషనల్కలెక్టర్డి. వేణుగోపాల్సూచించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి యాంటి డ్రగ్కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.
పేరెంట్స్ మీటింగ్‌లతో పాటు స్టూడెంట్స్‌కు స్పెషల్క్లాసెస్ పెడ్తూ డ్రగ్స్, గంజాయి తీసుకోవడం వల్ల కలిగే అనర్ధాలను వివరించాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో ఆర్డీవో మధు, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ఆఫీసర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుదాం
భద్రాచలం : ‘డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుదాం’ అంటూ భద్రాచలం జూనియర్ కాలేజీలో గురువారం ప్రిన్సిపాల్డి.సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. మానసిక ఒత్తిడి, సమస్యలను జయించేందుకు టెలీమానాస్ అనే సంస్థ హెల్ప్ లైన్ నంబరు 14416కు ఫోన్ చేయొచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు.