స్టూడెంట్స్​కు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి :  అడిషనల్ కలెక్టర్ విద్యాచందన

స్టూడెంట్స్​కు మెనూ ప్రకారం భోజనం పెట్టాలి :  అడిషనల్ కలెక్టర్ విద్యాచందన
  • భద్రాద్రికొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ విద్యాచందన

చండ్రుగొండ, వెలుగు : స్టూడెంట్స్​కు తప్పనిసరిగా మెనూ ప్రకారం భోజనం పెట్టాలని భద్రాద్రికొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ విద్యాచందన కేజీబీవి స్పెషల్​ ఆఫీసర్ కవితను ఆదేశించారు. మంగళవారం చండ్రుగొండ లోని కేజీబీవీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిల్వ ఉన్న కూరగాయలు, స్టూడెంట్స్ కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు.

మంగళవారం మెనూ ప్రకారం పెట్టాల్సిన కోడిగుడ్డు ఎందుకు పెట్టలేదని స్పెషల్​ ఆఫీర్ ను ప్రశ్నించారు. గుడ్లు సరఫరా కాలేదని, సాయంత్రం పెడుతామని ఆమె బదులు ఇచ్చారు. అన్నం ముద్దగా ఉండడం, కూర విద్యార్థులకు సరిపోను వండకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేలా టీచర్లు కృషి చేయాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో అశోక్ ఉన్నారు.