మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలోని 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీల ప్రతినిధులు చొరవ తీసుకోవాలని అదనపు కలెక్టర్ విజ యేందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ డీఆర్ఓ హరిప్రియతో కలిసి, ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో యువత శాతం ఎక్కువగా ఉన్న ప్పటికీ, ఓటరు నమోదు శాతం పెరగడం లేదని అన్నారు.
బీఎల్ఓ భాగస్వామ్యంతో యువత ఓటరు గుర్తింపు కార్డు నమోదు చేసుకునేలా చూడాలని పార్టీ ప్రతినిధులను కోరారు. ప్రస్తుతం జిల్లాలో 2435 పోలింగ్ బూత్లున్నా యన్నారు. 1500 మందికి ఒక పోలింగ్ బూత్ ప్రకారం జిల్లాలో అదనంగా 38 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో కీసర ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వర్ రెడ్డి, పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టరు రాధికా గుప్తా సూచించారు. సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, ప్లైయింగ్ స్వాడ్స్,రూట్ ఆఫీసర్లు, డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు వారి వారికి కేటాయించిన విధుల్లో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని అన్నారు. పరీక్షా సెంటర్లలోరూట్ మ్యాప్ లు, షైన్ బోర్డ్స్, సీటింగ్ అరేంజ్ మెంట్ వంటి వాటిని సరిగా ఉన్నాయా అని పరిశీలించాలని చెప్పారు.