దానంపల్లిని సందర్శించిన అడిషనల్​ కలెక్టర్

దానంపల్లిని సందర్శించిన అడిషనల్​ కలెక్టర్

చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లాలో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా మంగళవారం అడిషనల్​ కలెక్టర్​గరిమా అగర్వాల్ మండలంలోని దానంపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో డంపింగ్​ యార్డు, తడి పొడి చెత్త ద్వారా తయారు చేస్తున్న వర్మీ కంపోస్ట్​ ఎరువును పరిశీలించారు.  పొడి చెత్తను అమ్మడం ద్వారా జీపీకి వచ్చిన ఆదాయం గురించి తెలుసుకున్నారు.

పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కల జాగ్రత్తకు చర్యలు తీసుకోవాలని జీపీ సెక్రటరీకి సూచించారు. వేసవిలో నీటి కొరత రాకుండా ముందుస్తు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ప్రాథమికోన్నత స్కూల్​లో పదో తరగతిలో  లెక్కల క్లాస్​ తీసుకున్నారు. ఉత్తమ విద్యార్థి వైష్ణవిని శాలువా కప్పి అభినందించారు.

కార్యక్రమంలో ఎంపీడీవో మహబూబ్​ అలీ, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, నియోజక వర్గ ప్రత్యేక అధికారి శ్రీరామ్​రెడ్డి, ఈఈ ఆర్​డబ్ల్యూ ఎస్​ గిరిధర్​, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్​ ఇంజనీర్​ అనిల్​ యాదవ్​, ఏఈ దివ్య, సిద్దిపేట డివిజన్​ పంచాయతీ అధికారి మల్లికార్జున్​రెడ్డి, ఏపీవో మంజులారెడ్డి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.