గ్రీవెన్స్​ కళకళ..ఎన్నికల కోడ్ ముగియడంతో సోమవారం ప్రారంభం

గ్రీవెన్స్​ కళకళ..ఎన్నికల కోడ్ ముగియడంతో సోమవారం ప్రారంభం

ఎన్నికల నేపథ్యంలో మూడు, నాలుగు నెలలుగా ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. ఎన్నికల కోడ్​ ముగియడంతో సోమవారం గ్రీవెన్స్​తిరిగి ప్రారంభించారు. దీంతో ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని ఆయా కలెక్టరేట్లు జనంతో కిటకిటలాడాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించి, త్వరగా పరిష్కరించాలని కోరారు. 

ఆయా కలెక్టరేట్లలో నిర్వహించిన గ్రీవెన్స్​లో కలెక్టర్లు, వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో అడిషనల్​ కమిషనర్ ​వినతులు స్వీకరించి, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 358 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కాశీబుగ్గ (కార్పొరేషన్)/ హనుమకొండ సిటీ/ జనగామ అర్బన్/ మహబూబాబాద్​/ ములుగు, వెలుగు: గ్రేటర్​వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్​లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్​కు వచ్చిన ఫిర్యాదులను అడిషనల్ కమిషనర్ అనిసూర్ రషీద్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సమస్యలకు సంబంధించిన మొత్తం 58 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. 

కార్యక్రమంలో ఎస్ఈ కృష్ణారావు, సీఎంహెచ్​వో డాక్టర్ రాజేశ్, డిప్యూటీ కమిషనర్ కృష్ణా రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులున్నారు. హనుమకొండ కలెక్టరేట్​లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. మొత్తం 111 దరఖాస్తులు రాగా, అందులో మున్సిపల్ శాఖ కు సంబంధించి 17 అర్జీలు ఉన్నాయని కలెక్టర్​తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ పద్మజ, డీఎంహెచ్ వో సాంబశివరావు, జడ్పీ సీఈవో వేదవతి, ఐఅండ్ పీఆర్ డీఈ భూపాల్ పాల్గొన్నారు. జనగామ కలెక్టరేట్​లో కలెక్టర్​రిజ్వాన్​బాషా షేక్,​ అడిషనల్​కలెక్టర్లు పింకేశ్​కుమార్, రోహిత్​సింగ్​లతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 21 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

కార్యక్రమంలో స్పెషల్​ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, డీఈవో కె. రాము, డీసీఎస్​వో రోజారాణి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్​లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ గ్రీవెన్స్ లో వివిధ సమస్యలపై 113 దరఖాస్తులను స్వీకరించారు. ఆయా దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు డేవిడ్, లెనిన్​ వత్సల్ టొప్పొ, సీఈవో నర్మద, వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు. ములుగు కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​లో వివిధ సమస్యలపై మొత్తం 55 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్​ఇలా త్రిపాఠి తెలిపారు. 

ఈ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్అండ్ బీ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ వర్షాకాలం సీజన్​లో అలెర్ట్​గా ఉండాలని ఆదేశించారు. రెడ్ జోన్ లో ఉండే ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమాల్లో అడిషనల్​ కలెక్టర్ పి.శ్రీజ, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్ కుమార్, డీఎంఅండ్ హెచ్ వో అప్పయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, జిల్లా పశువైద్యాదికారి జె.రవికుమార్, ఎన్పీడీసీఎల్ డీఈ నాగేశ్వరరావు, ఇరిగేషన్ డీఈ అప్పలనాయుడు, డీఈవో పాణిని తదితర అధికారులు పాల్గొన్నారు.