
హైదరాబాద్, వెలుగు: ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పనిచేస్తే లైఫ్‌లో సక్సెస్సాధించవచ్చని సిటీ అడిషనల్ సీపీ ఎన్.శ్వేత చెప్పారు. శుక్రవారం ఉమెన్ సేఫ్టీ వింగ్ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
బాలికలు స్టడీ, స్పోర్ట్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరచాలన్నారు. మహిళల భరోసాకు ఉమెన్‌సేఫ్టీ వింగ్చేస్తున్న కృషిని అభినందించారు. లింగ సమానత్వంపై అవగాహన పెంచితే మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలను అరికట్టే అవకాశం ఉందన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నాయక్, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ శైలజ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.