
హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. శనివారం ( మార్చి 22 ) ఉదయం వాకింగ్ చేస్తుండగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అడిషనల్ డీసీపీ నందీశ్వర బాబ్జీ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. లక్ష్మారెడ్డి పాలెం దగ్గర వాకింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో బాబ్జీ అక్కడిక్కడే మృతి చెందారు. బాబ్జీ తెలంగాణ అడిషనల్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బాబ్జీ మృతితో ఆయన కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది.