లగచర్లలో పోలీసులు ఎక్కడ .. వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడిషనల్ డీజీ మహేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగవత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యటన

  • ఆరోజు డ్యూటీలో ఎవరెవరున్నారు?
  • మానిటరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేసిందెవరు? నిఘా ఏమైంది?
  • ఎస్పీ, డీఎస్పీల నుంచి వివరణ తీసుకున్న ఏడీజీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/వికారాబాద్, వెలుగు: వికారాబాద్  జిల్లా లగచర్ల ఘటనపై అడిషనల్ డీజీ (లా అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  భగవత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం నుంచి స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జిల్లా హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన శనివారం పర్యటించారు. గత బుధవారం పరిగిలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్డి, వికారాబాద్  డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, కొడంగల్  సీఐ శ్రీధర్ రెడ్డి, బొంరాస్ పేట పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  చెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను రికార్డు చేశారు. 

నిఘా వైఫల్యంతో పాటు స్థానికంగా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం లేకపోవడంతో పాటు అప్రమత్తంగా ఉండకపోవడం వల్లనే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రజాభిప్రాయ సేకరణకు ముందు రోజు స్థానికంగా ఏం జరిగిందనే సమాచారంతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. పోలీసుల నిఘా వైఫల్యం సహా విధ్వంసం జరిగిన రోజు పోలీసుల బందోబస్తుకు సంబంధించి అధికారుల వివరణతో స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ రికార్డు చేస్తున్నారు.

కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సమగ్ర నివేదిక

ఎస్పీ ఆఫీసులో విచారణ అనంతరం డీజీ మహేశ్  భగవత్  జిల్లా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యాలయానికి వెళ్లారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రతీక్ జైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. ఫార్మా కంపెనీకి సేకరించతలపెట్టిన భూసేకరణ ఆయా గ్రామాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఫార్మా ఇండస్ట్రీ వల్ల స్థానికంగా తలెత్తే సమస్యలు, ప్రజాభిప్రాయ సేకరణ గురించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాచారం సేకరించారు. 

ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతం నుంచి లగచర్లకు వెళ్లడానికి గల కారణాలను కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారా? ఇస్తే.. వాళ్లు ఏమని చెప్పారు అన్న వివరాలను కూడా సేకరించారు. భూ సేకరణను వ్యతిరేకిస్తూ గతంలో ఎవరైన సంప్రదించారా అనే వివరాలతో స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రికార్డు చేశారు. కలెక్టర్  ఆఫీసు నుంచి తిరిగి వెళ్తూ మీడియాతో డీజీ మాట్లాడారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్  ప్రతీక్ జైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో ఇద్దరు గన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్ ను పెంచాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

నిందితుడు సురేశ్​ కోసం పోలీసుల సెర్చ్​ ఆపరేషన్​

ఈ కేసులో  ప్రధాన నిందితుడు సురేశ్  కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. కర్నాటక, మహారాష్ట్రలో సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఆపరేషన్ చేస్తున్నారు. చేవెళ్ల  పరిసర ప్రాంతాల్లోని ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. ముందస్తు పథకం ప్రకారమే సురేశ్​ను తప్పించిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడులు చేసిన తరువాత పోలీసులకు చిక్కకుండా ఎక్కడికి పారిపోవాలి, ఆర్థికపరమైన సహాయం, కొత్త ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వినియోగం గురించి ముందుస్తు ప్రణాళిక తయారు చేసుకున్నట్లు భావిస్తున్నారు. పార్టీ ప్రముఖులు ఎవరైనా అతనికి షెల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.