తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ గురువారం ఉదయం పరిగి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వికారాబాద్ ప్రభుత్వ అధికారలపై దాడి కేసులో విచారణ వేగవంతంగా కొసాగుతోంది. నిందితులను కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ తోపాటు ఐజి, వికారాబాద్ ఎస్పీ పరిగిపోలీస్ స్టేషన్ కు వెళ్లారు. దాడికి పాల్పడిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అని విచారణ కొనసాగుతుంది. భోగమోని సురేష్ తోపాటు ప్రధాన నిందితులు పరారీలోనే ఉన్నారు. పరిగి పోలస్ స్టేషన్ కు రెండు వ్యాన్లలో పోలీసు బలగాలను తరలించారు.