
జూలూరుపాడు, వెలుగు : జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అడిషనల్ డీఎంహెచ్ వో భాస్కర్ నాయక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులు పరిశీలించి ప్రసవాల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. రానున్న వర్షాకాలంలో విష జ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రతలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, సీహెచ్ వో వెంకటేశ్వర్లు,హెడ్ నర్స్ వరలక్ష్మి ,హెల్త్ అసిస్టెంట్ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.