ప్రజలకు భరోసా కల్పించేందుకే ఫ్లాగ్ మార్చ్ : ఎస్పీ భీంరావు

మెట్ పల్లి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రజలకు రక్షణపై భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని అడిషనల్ ఎస్పీ భీంరావు అన్నారు. గురువారం మెట్ పల్లి పట్టణంలో 200 సీఐఎస్ఎఫ్ సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అంతకుముందు అడిషనల్ ఎస్పీ బస్ డిపో వద్ద జెండా ఊపి ఫ్లాగ్ మార్చ్ ప్రారంభించారు. ర్యక్రమంలో డీఎస్పీ ఉమామహేశ్వర్ రావు, సీఐలు నవీన్, సురేశ్‌‌‌‌‌‌‌‌బాబు, ఎస్సైలు చిరంజీవి, కిరణ్ కుమార్, అనిల్, శ్వేతా, శ్యాం రాజ్  కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

సిరిసిల్ల టౌన్, వెలుగు: ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని, అందుకు పోలీస్‌‌‌‌‌‌‌‌ శాఖ ఆధ్వర్యంలో పూర్తి రక్షణ కల్పిస్తామని సిరిసిల్ల టౌన్​ సీఐ రఘుపతి తెలిపారు. గురువారం సిరిసిల్ల జిల్లాకేంద్రంలో కేంద్రబలగాలతో కలిసి లోకల్‌‌‌‌‌‌‌‌ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పట్టణంలోని సుభాశ్ నగర్, నెహ్రూనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గోపాల్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీవైనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుందరయ్య నగర్, వెంకంపెట్, నేతన్న చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్ మీదుగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.