బ్యాంకుల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలి : చంద్రయ్య

బ్యాంకుల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలి :  చంద్రయ్య
  • అడిషనల్ ఎస్పీ చంద్రయ్య

రాజన్నసిరిసిల్ల, వెలుగు: బ్యాంకుల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలని అడిషనల్ ఎస్పీ చంద్రయ్య అన్నారు.----- మంగళవారంఆయన భద్రత ఏర్పాట్లపై బ్యాంక్  ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 

ప్రతి బ్యాంక్ వద్ద ఎలక్ట్రానిక్ అలారం, ఏటీఎంల వద్ద  సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏఎస్పీ సూచించారు. బ్యాంకుల వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జున్, కంట్రోలర్స్, మేనేజర్లు, అధికారులు, పాల్గొన్నారు.