నారాయణపేట, వెలుగు: కరీంనగర్ జిల్లాలో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన మూడో తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 లో నారాయణపేట జిల్లా నుంచి అడిషనల్ ఎస్పీ ఎండీ రియాజ్ లాన్ టెన్నిస్ సింగిల్స్ లో గోల్డ్ మెడల్, డబుల్స్ లో బ్రౌం జ్ మెడల్, టీమ్ ఈవెంట్ లో బ్రౌంజ్ మెడల్ సాధించారు.
జిల్లా నుంచి మహిళా కానిస్టేబుల్ సంధ్యారాణికి లాంగ్ జంప్ లో బ్రౌంజ్ మెడల్ రాగా ఎస్పీ యోగేశ్ గౌతమ్ ఇద్దరిని అభినందించారు.