పాఠాలు పక్కకు.. పర్యవేక్షణ ముందుకు!

  • బాసర ట్రిపుల్ ఐటీలో ఫ్యాకల్టీకి అడిషనల్ వర్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • 50 నుంచి 60 మంది నాన్ అకడమిక్ పనులకు కేటాయింపు 
  • క్లాసుల ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇబ్బందులు పడుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు
  • ఫ్యాకల్టీని అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితం చేయాలని కోరుతున్న విద్యార్థులు

హైదరాబాద్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీలో పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు.. పర్యవేక్షణ పనులతోనే బిజీగా గడుపుతున్నారు. అకడమిక్ పనులనే కాకుండా నాన్ అకడమిక్ పనులనూ వర్సిటీ అధికారులు వారికి అప్పగించారు. దీంతో క్లాసులకు ప్రిపేర్ కావడానికి వారికి సమయం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్​ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఆర్జీయూకేటీ) కాంట్రాక్టు ఫ్యాకల్టీతోనే నిండిపోయింది. 19 మంది మాత్రమే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండగా.. ప్రస్తుతం ఏడుగురు మాత్రమే పనిచేస్తున్నారు. సుమారు 129 మంది కాంట్రాక్టు ఫ్యాకల్టీ విధులు నిర్వర్తిస్తున్నారు.
  
స్టూడెంట్ల రిజల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రభావం..

అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అదనపు పనులు అప్పగించడంతో ఆ ప్రభావం స్టూడెంట్ల రిజల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పడుతోంది. కొన్ని బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో సింగిల్ డిజిట్ రిజల్ట్ వచ్చిందనే ఆరోపణలూ ఉన్నాయి. అధికారికంగా ఏనాడూ ఫలితాల వివరాలను ప్రకటించకపోవడంతో ఈ ఆరోపణలు నిజమేనన్న వాదనలు ఉన్నాయి. గతేడాది ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ సెమిస్టర్ మొత్తానికి ఒకటి, రెండు క్లాసులే చెప్పడంతో విద్యార్థులు డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేసి, చివరికి వారితోనే క్షమాపణలు చెప్పించుకున్నట్టు తెలిసింది. అయితే, అక్కడ సబ్జెక్టు ఫ్యాకల్టీనే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. వారికి సమయం లేకపోవడంతో పాత క్వశ్చన్ పేపర్లనే మారుస్తూ ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 

ఇంకొందరు సెమిస్టర్ చివర్లో వారం, పది రోజులు మాత్రమే రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా క్లాసులు తీసుకుంటారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వర్సిటీ ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు స్పందించి ఫ్యాకల్టీలను పర్యవేక్షణ బాధ్యతలను తప్పించి, అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితం చేయాలని కోరుతున్నారు. ఈ అంశంపై ఆర్జీయూకేటీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ వీసీ వెంకటరమణను వివరణ కోరగా.. సుమారు 50 మంది ఫ్యాకల్టీకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. దీని ప్రభావం అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పడదన్నారు. 

50 నుంచి -60 మందికి పర్యవేక్షణ బాధ్యతలు..

గతంలో 10 – 15 మంది ఫ్యాకల్టీ మాత్రమే అడిషనల్ వర్క్స్ నిర్వహించేవారు. అవి కూడా అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించినవే ఉండేవి. గత రెండేండ్ల నుంచి ప్రస్తుతమున్న టీచింగ్ ఫ్యాకల్టీలో 50 నుంచి 60 మందికి ఇతర బాధ్యతలు అప్పగించారు. వర్సిటీలో డ్రైనేజీ, వాటర్ సప్లై, హౌజ్ కీపింగ్, సివిల్ వర్క్స్, గెస్టు హౌజ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, గార్డెనింగ్ సెక్షన్, హౌజ్ కీపింగ్, ప్రొక్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, హెల్త్ సెంటర్, స్పోర్ట్స్, లైబ్రరీ, వార్డెన్స్, స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్, అకడమిక్ ఇలా పలు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు రోజంతా ఆయా పనుల్లోనే బిజీగా గడుపుతున్నారు.