
నేరడిగొండ, వెలుగు: బోథ్ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ చార్జ్ ఆడే గజేందర్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో మంత్రి సీతక్క, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశ్ ఆధ్వర్యంలో గజేందర్ ఆదివారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అటవీ భూముల సమస్య, కుప్టి ప్రాజెక్ట్ తోపాటు పలు సమస్యలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.