AUS vs IND: ఆటగాళ్లను దాగుడుమూతలు ఆడించిన ఫ్లడ్‌లైట్లు.. అభిమానులు ఫ్లాష్‌లతో సందడి

AUS vs IND: ఆటగాళ్లను దాగుడుమూతలు ఆడించిన ఫ్లడ్‌లైట్లు.. అభిమానులు ఫ్లాష్‌లతో సందడి

అడిలైడ్ ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు ఆటలో భాగంగా ఊహించని సంఘటన ఒకటి జరిగింది. ఆట మూడో సెషన్ లో ఫ్లడ్‌లైట్ లోపం కారణంగా కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 18వ ఓవర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. భారత పేసర్ హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తుండగా లైట్లు ఆరిపోయాయి.

రెండు నిమిషాల ఆటకు అంతరాయం కలిగించిన తర్వాత లైట్లు మళ్లీ వెలిగాయి. అయితే కేవలం రెండు బంతులు వేసిన మళ్లీ ఆరిపోయాయి. ఈ సమయంలో క్రీజులో మార్నస్ లాబుషాగ్నే, నాథన్ మెక్‌స్వీనీ బ్యాటింగ్ చేస్తున్నారు. బౌలర్ హర్షిత్ రాణాతో పాటు భారత ఆటగాళ్లు కాస్త అసహనానికి గురయ్యారు. ఇదే సమయంలో స్టేడియంలో ఆటగాళ్లు తన ఫోన్ లోని ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసి సందడి చేశారు. మొత్తానికి ఫ్లడ్‌లైట్లు ఆటగాళ్లకు చికాకు తెప్పించగా.. అభిమానులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. 

ALSO READ : U19 Asia Cup 2024: చితక్కొట్టిన సూర్యవంశీ.. ఫైనల్‌కు దూసుకెళ్లిన యువ భారత్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ లో ఆచితూచి ఆడుతుంది. ప్రస్తుతం 27 ఓవర్లలో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. ఖవాజా 13 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో మార్నస్ లాబుషాగ్నే(17), నాథన్ మెక్‌స్వీనీ(31) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ చెలరేగడంతో పాటు మిగిలిన బౌలర్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 180 పరుగులకే ఆలౌట్ అయింది.