పత్రికా రంగం స్వర్ణ యుగంగా వెలుగొందడానికి కారణం హనుమంతరావు వంటివారే

పత్రికా రంగం స్వర్ణ యుగంగా వెలుగొందడానికి కారణం హనుమంతరావు వంటివారే

ఖైరతాబాద్, వెలుగు: తెలుగు పత్రికా రంగంలో విశ్లేషణలతో కూడిన కథనాలకు ఆధ్యుడు హనుమంతరావు అని వక్తలు కొనియాడారు. నిరంతరం సమాజ హితం కోసం పరితపించారని గుర్తుచేశారు. వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో  డీఎన్ఎఫ్​వ్యవస్థాపకుడు పి.హనుమంతరావు శతజయంతిని శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్‎లో నిర్వహించారు. అతిథులుగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, సీనియర్ జర్నలిస్ట్​పరకాల ప్రభాకర్, వీక్షణం ఎడిటర్​వేణుగోపాల్ పాల్గొని మాట్లాడారు.

 పత్రికా రంగం స్వర్ణ యుగంగా వెలుగొందడానికి హనుమంతరావు వంటివారే కారణమన్నారు. ప్రజల పక్షాన కథనాలు రాస్తూ పాలకులను ఆలోచింపజేసిన వ్యక్తి హనుమంతరావు అన్నారు. తెలుగు పత్రికా రంగంలో ఆర్థిక విశ్లేషణలతో కూడిన కథనాలను పరిచయం చేసింది హనుమంతరావునేనని చెప్పారు. స్టేట్, సెంట్రల్​బడ్జెట్లను విశ్లేషించి కథనాలు రాయడంలో ఆయన దిట్ట అని, నేటి జర్నలిస్టులకు హనుమంతరావు ఆదర్శప్రాయుడని కొనియాడారు.