యాదగిరిగుట్ట క్షేత్రంలో ఘనంగా ముగిసిన అధ్యయనోత్సవాలు

  • లక్ష్మీ నారసింహస్వామి అలంకారంలో భక్తులను అలరించిన స్వామివారు

యాదగిరిగుట్ట, వెలుగు:  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనారసింహస్వామి క్షేత్రంలో ఆరు రోజులుగా జరుగుతున్న అధ్యయనోత్సవాలు బుధవారం ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం నిర్వహించిన లక్ష్మీనారసింహస్వామి అలంకార సేవతో అధ్యయనోత్సవాలకు అర్చకులు పరిసమాప్తి పలికారు.

ఈ నెల 10న మొదలైన అధ్యయనోత్సవాలు.. 15 వరకు వైభవంగా జరిగాయి.  ఇందులో భాగంగా ఈ నెల 10 నుంచి రోజుకు రెండు అవతారాల్లో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.  చివరి రోజు  శ్రీలక్ష్మీనారసింహస్వామి అలంకార సేవతో అధ్యయనోత్సవాలకు ముగింపు పలికారు.  

ముగిసిన ధనుర్మాస ఉత్సవాలు

యాదగిరిగుట్టలో  నెల రోజులుగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలు మంగళవారం ముగిశాయి.  ఉత్సవాల్లో భాగంగా ఉదయం చేపట్టిన  ‘ఒడి బియ్యం’  కార్యక్రమంతో ధనుర్మాస ఉత్సవాలకు అర్చకులు ముగింపు పలికారు.  డిసెంబర్ 16న ప్రత్యేక పూజలతో మొదలైన ధనుర్మాస ఉత్సవాలు.. జనవరి 14 వరకు వైభవంగా నిర్వహించారు. మంగళవారం చేపట్టిన అమ్మవారికి ‘ఒడిబియ్యం’ సమర్పణ కార్యక్రమంతో ఉత్సవాలు ముగిసినట్లు అర్చకులు తెలిపారు.