మే 2 నుంచి ఆది కైలాస్​ యాత్ర

మే 2 నుంచి ఆది కైలాస్​ యాత్ర

పితోర్​గఢ్: ఉత్తరాఖండ్‎లోని ఆది కైలాస్​యాత్ర మే 2న ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ధార్చుల టౌన్‎లో ఏప్రిల్ 30 నుంచి యాత్రకు సంబంధించిన ఇన్నర్ లైన్ పాస్‌‌‌‌‌‌‌ లను జారీ చేస్తామని ధార్చుల సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్ డీఎం) మంజీత్ సింగ్ చెప్పారు. ఈ యాత్ర ఏప్రిల్ 30 నుంచి జూన్ 30 వరకు, వర్షాకాలం తర్వాత సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ మధ్య వరకు రెండు దశల్లో జరుగుతుంది.

 ‘‘రద్దీని నివారించడానికి ప్రతి యాత్రికుడికి నాలుగు రోజులు మాత్రమే ఇన్నర్ లైన్ పర్మిట్లు జారీ చేస్తాం. యాత్రికులు శిఖరాన్ని ఒకసారి చూసి బేస్ క్యాంప్‌‌‌‌కు వచ్చి ఇతరులకు అవకాశం కల్పించొచ్చు” అని ఎస్ డీఎం పేర్కొన్నారు.