
హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా.. ఏ పాత్రనైనా అవలీలగా చేసే టాలెంట్ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. క్యారెక్టర్ ఎలాంటి దైనా ఫెర్ఫామెన్స్ తో ఇంప్రెస్ చేసేస్తా డు. అందుకే ఏవైనా డిఫరెంట్ రోల్స్ ఉన్నప్పుడు దర్శకులు ఆది గురించి ఆలోచిస్తున్నా రు. ‘సరైనోడు’లో స్టైలిష్ విలన్ ఆఫర్ వచ్చింది, ‘రంగస్థలం’లో కూల్ బ్రదర్ రోల్ దక్కింది అందుకే. రీసెంట్‌గా ఆదిని మరో మంచి అవకాశం వెతుక్కుంటూ వచ్చిందట. అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కి స్తున్న ‘పుష్ప’లో ఆదికి చాన్స్ దక్కిందట. ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపిస్తాడట. కథానుసారం అతనికి ఇద్దరు అన్నయ్యలు ఉంటారట. ఒక అన్నయ్యది గ్రామ సర్పంచ్‌గా క్రూషియల్ రోల్ అట. అందుకే ఆ పాత్రకి ఆదిని సెలె క్ట్ చేసుకున్నాడట సుకుమార్. ఆల్రెడీ ‘రంగస్థలం’ టైమ్ లో ఆది టాలెంట్, కమిట్‌మెంట్ చూసి ఉండటం వల్ల అతనికే ఓటు వేసినట్లు తెలుస్తోంది.