సూపర్​ నేచురల్ థ్రిల్లర్ గా శంబాల .. రామోజీ ఫిల్మ్ సిటీలో తాజా షెడ్యూల్ స్టార్ట్

సూపర్​ నేచురల్ థ్రిల్లర్ గా శంబాల .. రామోజీ ఫిల్మ్ సిటీలో తాజా షెడ్యూల్ స్టార్ట్

డిఫరెంట్ కాన్సెప్టులు సెలెక్ట్ చేసుకుంటూ  బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు  ఆది సాయికుమార్. తాజాగా తన నుంచి రాబోతున్న చిత్రం ‘శంబాల’.  యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్‌‌ అన్నభీమోజు , మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో  తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో జియో సైంటిస్ట్‌‌గా ఆది కనిపించనున్నాడు. 

అర్చన అయ్యర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. శ్వాసిక, రవి వర్మ, మీసాల  లక్ష్మణ్, మధునందన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  శ్రీరామ్‌‌ మద్దూరి సంగీతం అందిస్తున్నాడు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో  శిక్షణ పొందిన యుగంధర్ ముని హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని హై టెక్నికల్ స్టాండర్డ్స్‌‌తో, గ్రాండ్ విజువల్స్‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు నిర్మాతలు తెలియజేశారు.